Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్ షాక్
పార్టీ నుంచి సస్పెండ్
.jpg)
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని వైసీపీ తన అధికార ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా కె.కె. రాజుని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నియమించారు.
వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్, తన కుటుంబ వ్యవహారం ఏపీలో సంచలనం రేపింది. మొదటి భార్య కుటుంబం పోలీస్ కేసులు, రెండో పెళ్లితో వివాదాలు కొనసాగాయి. ఐతే తాజాగా ఆయనపై వైసీపీ వేటు వేసింది.
About The Author

Latest News
