మున్సిపల్ శాఖపై ప్రైవేటు వ్యక్తి పెత్తనం?

హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి విభాగాల్లో కీలక ఫైళ్లపై ‘అజ్ఞాత అధికారి’ ఆదేశాలు!

On
మున్సిపల్ శాఖపై ప్రైవేటు వ్యక్తి పెత్తనం?

హైదరాబాద్, సాయి సూర్య; మున్సిపల్ శాఖలో ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. సంబంధిత శాఖలకు అధికారికంగా ఏ సంబంధమూ లేకపోయినా, ఫైళ్లపై నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తున్నాడంటూ చర్చలు జరుగుతున్నాయి.

తాజాగా వేసవి సెలవుల పేరిట విదేశాలకు వెళ్లిన ఆయన, “తాను తిరిగివచ్చే వరకూ కీలకమైన ఫైళ్లను ఆపేసి పెట్టాలి” అంటూ అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో నాలుగైదు రోజులుగా హెచ్‌ఎండీఏ, ప్లానింగ్ విభాగాల్లో ఫైళ్ల క్లియరెన్స్ నిలిచిపోయింది.

ఆయన హెచ్‌ఎండీఏ కార్యాలయానికి తరచూ వచ్చి, ప్లానింగ్ శాఖ ఫైళ్లను ప్రత్యేకంగా ఆరా తీస్తారని, భూమి మార్పిడి, అనుమతులపై స్వయంగా హస్తక్షేపం చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. "మీ ఫైలు పరిశీలనలో ఉంది, కలిస్తే పనవుతుంది" అన్నట్టు సూచనలు ఇస్తున్నట్టు వినిపిస్తోంది.

ఈయన ముఖ్యమంత్రి సన్నిహితుడని, ఆయన పేరుతో వ్యవహరిస్తున్నాడని కొందరంటుంటే, అసలు సీఎంకు ఈ వ్యవహారం తెలుసా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉండగా, అధికార యంత్రాంగం అప్పటివరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read More తుర్కయంజాల్ లో రేపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

Views: 37

About The Author

Latest News

hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు.  ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు. ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: గంగరాయి చెరువు మాయం అవుతోంది. కబ్జాదారులు చెరువును పూడ్చేస్తూ.. కనుమరుగు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. హైడ్రా స్పందన కరువైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ...
Kavitha :బీఆర్ఎస్‌లోని అగ్రనేతలే టార్గెట్‌గా ఆమె విమర్శనాస్త్రాలు . కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు
నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు
దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రెడీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్
Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు
Banoth Madanlal:గుండెపోటుతోమాజీ ఎమ్మెల్యేమృతి