బ్రేకింగ్ :తెలంగాణలో మరొకొత్త పార్టీ ఆవిర్భవించనుందా?బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ పుట్టుకురానుందా?
కవిత కొత్త పార్టీకి ముహుర్తం ఖరారు..జూన్ 2న పార్టీని ప్రకటించే అవకాశం

కవిత మరో షర్మిల కానుందా?
కవిత పెట్టబోయే పార్టీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పార్టీ?
జెండా అజెండా ఇప్పటికే ఖరారైందా?
తెలంగాణ-సాయి సూర్య;తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా పుట్టుకొచ్చి...తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత అనేక పార్టీలు పుట్టుకొచ్చిన మనుగడ సాధించలేకపోయాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇక ఇఫ్పుడు ఈ పార్టీ చీలకకు గురికానుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో బంధు ప్రీతి సర్వసాధారణం. ఇప్పటి వరకు అనేక పార్టీల్లో ఇదే కొనసాగింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన ఈ పార్టీలోనూ ఇదే సంప్రదాయం కొనసాగింది. ఆ బంధు ప్రీతి చీలకకు అనేక పార్టీల్లో కారణమైనట్టే ఇఫ్పుడు బీఆర్ఎస్ లోనూ కనిపిస్తోంది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కల్వకుంట్ల కవిత తన తండ్రి స్థాపించన పార్టీ ద్వారా రాజకీయం రంగ ప్రవేశం చేశారు. ఎంపీగా పని చేసిన ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఐతే పార్టీలో విభేదాలు ఉన్నాయని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. తాజా ఆమె కేసీఆర్ కు లేఖ రాయడం కలకలం రేపింది. ఆ లేఖపై కేటీఆర్ పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యలు చేయడం మరింత అగ్గికి ఆజ్యం పోసినట్టుగా మారింది. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ అంశం తెరపైకి వచ్చింది.
కవిత ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. జెండా, అజెండా ఖరారు చేశారని అంటున్నారు. జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పార్టీ పేరును, జెండాను ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ జెండా లైట్ బ్లూ కలర్ లో సిద్ధం చేశారని టాక్. సామాజిక తెలంగాణే అజెండాగా పార్టీ ఉంటుందని చెప్తున్నారు. పార్టీ పేరును టీబీఆర్ఎస్ గా నామకరణం చేసినట్టుగా చెప్తున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. ఇటీవల కవిత విదేశాల పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఆమె అనుచరులు లైట్ బ్లూ కలర్ తో ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో ఆదే పార్టీ జెండా కలర్ గా డిసైడ్ అయ్యిందంటున్నారు. ఐతే పార్టీ ప్రకటన, విదివిధానాలు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రకటిస్తారని టాక్. ఐతే కవిత పార్టీని ప్రకటిస్తే..తర్వాత బీఆర్ఎస్ లో ఎలాంటి పరిణామాలు ఉంటాయని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో జగన్ సోదరి షర్మిల సొంత పార్టీ పెట్టి...విఫలం అయ్యారు. ఆమె తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక కవిత కూడా తన అన్న కేటీఆర్ తో విభేదాల కారణంగానే పార్టీ పెడుతున్నారని చర్చ జరుగుతోంది. కవిత ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.
About The Author
