42సార్లు ఢిల్లీ కి చక్కర్లు

ఉపాధి కూలీల పనిదినాలు తగ్గినా పట్టింపేది సిఎం రేవంత్‌పై హరీష్‌ రావు విమర్శలు

On
42సార్లు ఢిల్లీ కి చక్కర్లు


హైదరాబాద్‌,మే3(సాయి సూర్య):ఉపాధి హావిూ పనిదినాలు 2024-25 సంవత్సరానికి 12.22 కోట్ల నుంచి 6.5 
కోట్లకు తగ్గాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 42 సార్లు దిల్లీ వెళ్లినా ఉపాధి పనిదినాలు సగం తగ్గాయని విమర్శించారు. విషయం తెలిసినా కాంగ్రెస్‌, భాజపా ఎంపీలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఉపాధి హావిూ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే కూలీల పనిదినాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 42 సార్లు ఢల్లీికి చక్కర్లు కొట్టినా.. తెలంగాణకు సాధించింది ఏం లేదని హరీష్‌రావు విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.download (3)

మరోవైపు ఉపాధి హావిూ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. వారి జీవితాలతో ఆడుకుంటుందని హరీష్‌రావు మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉపాధి హావిూ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని హరీష్‌రావు ఆరోపించారు. 2024-25లో రూ.12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఈ సంవత్సరం కేవలం రూ. 6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సరైన పనిదినాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలని హరీష్‌రావు కోరారు.

Views: 10

Latest News

42సార్లు ఢిల్లీ కి చక్కర్లు 42సార్లు ఢిల్లీ కి చక్కర్లు
హైదరాబాద్‌,మే3(సాయి సూర్య):ఉపాధి హావిూ పనిదినాలు 2024-25 సంవత్సరానికి 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు తగ్గాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి...
తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం:పొంగులేటి
10th class results:పది ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్( తుర్కయంజాల్ బ్రాంచ్) విద్యార్థులు.
SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి