తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం:పొంగులేటి
On

హైదరాబాద్,మే3(సాయి సూర్య): గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదే అన్నారు. న్యాక్‌లో 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. రిజిస్టేష్రన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి మంత్రి ఆర్డర్ కాపీలు అందజేసి మాట్లాడారు. తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. టోల్‌ఫ్రీ నెంబర్ ఇస్తాం.. దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలి.. దీనిలో మరో మాట లేదు. ఇళ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతికత వాడుతున్నాం. ఫేజ్-1 నుంచి ఫేజ్-4 వరకు జాగ్రత్తగా సిఫారసు చేయాలి. అర్హులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలూ పరిశీలించాలి. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని పొంగులేటి తెలిపారు.
Views: 60
Latest News
03 May 2025 16:00:10
హైదరాబాద్,మే3(సాయి సూర్య):ఉపాధి హావిూ పనిదినాలు 2024-25 సంవత్సరానికి 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు తగ్గాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి...