బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా?
పార్టీ పండుగలో హరీశ్ రావు ఫోటో ఏమైంది?

పత్రికలు, బ్యానర్లు, పోస్టర్లలో కనిపించని హరీశ్ రావు ఫోటో
సభలోనూ దూరంగా కూర్చుకున్న హరీశ్ రావు
హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు నెంబర్ -2. మరి ఇప్పుడు...? పెద్ద క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ పార్టీలో ఆయన స్థానం ఏంటి? పార్టీకి దూరంగా ఉంటున్నారా? దూరం పెడుతున్నారా? బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎందుకా..దూరం.? పార్టీ ఎందుకు దూరం పెట్టింది. ?
బీఆర్ఎస్ రజతోత్సవ సభ 25ఏళ్ల పండుగ అంగరంగ వైభవంగా సాగింది. ఎల్కతుర్తి సభ మొత్తం గులాబీమయం అయ్యింది. అయితే సభ ఏర్పాట్ల దగ్గరి నుంచి స్టేజీ మీదకు కూర్చోవడం వరకు హరీశ్ రావు...అంతంత మాత్రంగానే వ్యవహరించారని అంటున్నారు.
టీఆర్ఎస్ అంటే...కేసీఆర్. ఆ పార్టీలో ఉద్యమకాలంలో వెంట ఉంది హరీశ్ రావు. కానీ ఆ హరీశ్ రావు కొన్ని రోజులుగా అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఆయన అలా ఉండటానికి కారణాలేంటి.? కావాలనే పక్కకు పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఆ పార్టీ పత్రిక ప్రకటనలు, బ్యానర్లు, వీడియోలు, పోస్టర్లు రూపొందించింది. సాధారణంగా ప్రతి సారి కేసీఆర్ ఫోటోతో పాటు, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఫోటోలు ఉంటాయి. కానీ ఈ సారి హరీశ్ రావు ఫోటోలు మిస్ అయ్యాయి. ఒక్క చోట కాదు మొత్తం ఈవెంట్లో హరీశ్ రావు ఫోటో కనిపించలేదు. కొన్ని పత్రికల్లో ఆయన ఫోటో కనిపించలేదు. కేసీఆర్, కేటీఆర్ ఫోటోతో మాత్రమే పత్రికల్లో ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చారు. ఇక కొంత మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫ్రంట్ పేజ్ ఇచ్చిన యాడ్ లోనూ హరీశ్ రావు ఫోటో మిస్ చేశారు.
ఇక బీఆర్ఎస్ సభ కోసం కట్టిన బ్యానర్లు, పోస్టర్లలోనూ హరీశ్ రావు ఫోటోలు కనిపించలేదు. వేదికపై వెనుక ప్లే చేసే వీడియోలోనూ కేసీఆర్, కేటీఆర్ మాత్రమే కనిపించారు.
ఇక హరీశ్ రావు సభలో కూడా దూరందూరంగానే ఉన్నారు. సాధారణంగా సభలు జరిగితే...పార్టీలో సీనియర్లు, కీలక నేతలను వరుస క్రమంలో కూర్చోబెడతారు. అధినేతకు ఇరు పక్కల కూర్చుంటారు. కానీ హరీశ్ రావు సాధారణ నేతల దూరంగా ఉన్నారు. కేటీఆర్ మాత్రం కేసీఆర్‌కు దగ్గరలోనే ఉన్నారు. హరీశ్ రావు..మాజీ మంత్రులు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డితో కలిసి కూర్చుకున్నారు.
సభలో హరీశ్ రావు ప్రసంగం కూడా చేయలేదు. కొందరు నేతలు మాత్రమే ప్రసంగించినప్పటికీ ఆయన అంటిముట్టనట్టుగానే వ్యవహరించారట. గతంలో హరీశ్ రావు పార్టీ ప్రతికార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకునే వారు. కానీ ఈసారి అవేమీ పట్టించుకోలేదు.
హరీశ్ రావును దూరం పెట్టడానికి కారణం కేటీఆర్ తో విభేదాలే అంటున్నారు. గతంలో కేటీఆర్ తో విభేధాలు ఉన్నాయని మీడియా కోడే కూసింది. ఇప్పుడు హరీశ్ రావుతో ఇవే కారణం అంటున్నారు. మొత్తంగా హరీశ్ రావు ఫోటోలు, ఆయన సభలో వ్యవహరించిన దూరం అనేక చర్చలకు కారణం అయ్యాయి.
✍️✍️అవినీతి పై అక్షరం తూట సాయి సూర్య