రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి

On
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

తుర్కయంజాల్ (సాయి సూర్య):రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలని GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ డిమాండ్ చేశారు. హయత్ నగర్ కోహెడను GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, GMPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లేష్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ...

b3ca9db5-5474-4339-abe4-706adb7cf750
GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, జిల్లా కార్యదర్శి మల్లేష్ బృందం

బాధిత రాసూరి శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.  కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ నవీన్‌ను కలిసి ధైర్యం చెప్పారు.  ఆ తర్వాత బాధితులతో కలిసి హయత్ నగర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ నాగరాజ్ గౌడ్‌ను కలిశారు. హైదరాబాద్, రంగారెడ్ది, మేడ్చల్, భువనగిరి జిల్లాల గ్రామాల్లో గొర్రెల దొంగతనాలు పెరిగిపోయాయని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.

3993fd3d-7dc4-4829-bd91-fe092ed978f3
దొంగలను పట్టుకోని, కఠిన శిక్ష పడేలా కృషి చేస్తాఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్

తాజాగా ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోలింగ్ పెంచాలని..సీ.సీ. కెమెరాల ఏర్పాటుతో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించాలన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. హయత్ నగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్పందిస్తూ రెండ్రోజుల్లో దుండగులను పట్టుకుంటామని అన్నారు.

✍️✍️అవినీతి పై అక్షరం తూట సాయి సూర్య,

Views: 69

Latest News

SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్  కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్