సాయిసూర్య చెప్పిందే నిజమైంది

నూతన సీఎస్‌గా కె. రామకృష్ణారావు

On
సాయిసూర్య చెప్పిందే నిజమైంది
నూతన సీఎస్‌గా కె. రామకృష్ణారావు

ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్నశాంతికుమారి

సాయిసూర్య-తెలంగాణ డెస్క్:సాయిసూర్య చెప్పిందే నిజమైంది. కొత్త సీఎస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అందులోనూ సాయి సూర్య అంచనా వేసిన అధికారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్‌ నియామకంపై గత కొంత కాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం.. రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఏడాది ఆగస్టులో రిటైర్డ్ అవ్వనున్నారు. ఐతే తర్వాత కూడా కొనసాగిస్తారా? లేక కొత్తవారిని తిరిగి ఎంపిక చేస్తుందా? అని ఆసక్తిగా మారింది.

Views: 129

Latest News

SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్  కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్