దేశంలో జనాభా లెక్కలకు మోక్షం

కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం

On
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం

జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం
2011లో చివరిసారిగా జనాభా లెక్కలు
2022లో జరగాల్సిన జనాభా లెక్కల తంతు
కోవిడ్ కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కలు
భారత్-పాక్ ఉద్రికత్తల వేళ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జానాభా సంఖ్య గురించి మాట్లాడాలి అంటే..2011లో చేపట్టిన రిపోర్టును లెక్కలోకి తీసుకునే వారు. ఇన్నేళ్ళ తర్వాత కేంద్రం ఎన్డీయే ప్రభుత్వం జానాభా లెక్కలకు అనుమతి ఇచ్చింది. కేంద్ర మంత్రి వర్గ భేటీలో జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాదు...దేశ వ్యాప్తంగా మొదలైన కుల గణన అంశాన్ని కూడా ఇందులో చేర్చింది. జనాభా లెక్కలతో పాటు కులాన్ని కూడా లెక్కించాలని నిర్ణయించింది. 

IMG-20250501-WA0300(2)
ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు తామే సాటి అని పెంచుకున్న తుర్క యంజాల్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్

దేశంలో కులగణన ఇప్పుడు రాజకీయంగా కీలకమైన అంశం. దీని కోసం ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. కుల గణను బిహార్ లో నితీశ్ ప్రభుత్వం చేపట్టి నివేదికను బహర్గతం చేసింది. ఆ తర్వాత తెలంగాణలోనూ కులగణణ సర్వే చేశారు. అన్ని వివరాలు నమోదు చేశారు. వాటిలో పాటు బీసీ జనగణన కూడా నిర్వహించింది. అయితే తాజాగా కేంద్రం కూడా ఆ కులగణన దిశగానే అడుగులు వేస్తోంది. దీంతో కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్ నెరవేరినట్టైంది.

ఐతే కుల గణన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోవడం. కొన్నేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. 

కాంగ్రెస్ కులగణన సర్వేపై విమర్శలు
ఐతే కాంగ్రెస్ రాష్ట్రాల్లో చేపట్టిన సర్వేపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విమర్శలు గుప్పించారు. కులగణన పేరుతో కాంగ్రెస్‌ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 
కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. 

భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ జన గణన నిర్ణయం
భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల వేళ...కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని, వీసాలు రద్దు వంటివి ఉన్నాయి. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయుల వివరాలు ఇవ్వాలని, వారు ఉంటే పంపేయాలని చెప్పింది. ఈక్రమంలో పోలీసులు వారి కోసం జల్లెడ కొనసాగించాయి. ఈక్రమంలో అనేక మంది పాకిస్థానీయులు ఆక్రమంగా దేశంలో నివసిస్తున్నట్టు గుర్తించింది. వారిని తిరిగి పాకిస్థాన్ పంపేస్తోంది. ఈక్రమంలో ఇంకా ఎంత మంది ఉన్నారో..తేల్చలేని పరిస్థితి. అయితే జనాభా లెక్కలు చేపడితే...ఈ వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Views: 2

Latest News

SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్  కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్