10th class results:పది ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్( తుర్కయంజాల్ బ్రాంచ్) విద్యార్థులు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

తుర్కయంజాల్,( సూర్య టుడే):పదవ తరగతి పరీక్ష ఫలితాలలోతుర్కయంజాల్ మున్సిపల్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాల విద్యార్థులు 19మంది విద్యార్థులకు గాను 19 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.574మార్కులతో జి. అక్షర ప్రథమ స్థానం కైవసం చేసుకోగా 567 మార్కులతో పి. రాంవివేక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను ముఖ్యఅతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి , మాజీ కౌన్సిలర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ హాజరై పాఠశాల డైరెక్టర్ బి భవిత తో కలిసి విద్యార్థులను
అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపదో తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయం అన్నారు.
ప్రపంచంలో మనిషి జీవన మనుగడకు విద్య ఎంతో కీలకమైన అంశమని అందుకోసం ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల కష్టాన్ని ఫలితంగా ఉన్నత మార్కులు సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. క్రమశిక్షణ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సులభతరం అవుతుందని సూచించారు.
పాఠశాల అడ్మినిస్ట్రేటర్ బోనగిరి కరుణ్‌కుమార్, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు .