సర్పంచ్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ ,మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

జూలై లో ఎన్నికలు ఉండే అవకాశం. ఎన్నికల సంఘం కసరత్తు

On

సాయిసూర్య-తెలంగాణ డెస్క్‌:
తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లినా.. ఒకటే చర్చ. ఈ సారి సర్పంచ్ ఎవరు అని. ఎవరు పోటీచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు పెడుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా అనే చర్చ . ఐతే ప్రభుత్వం ఈ ఎన్నికపై క్లారిటీ ఇవ్వడంలేదుగాని...మంత్రులు మాత్రం అప్పుడప్పుడు.. ఆశావహుల ఆశలు చిగురించేలా... కమ్మని మాటలు చెప్తున్నారు. దీంతో గ్రామాల్లో కొంచెం హడావిడి కనిపిస్తోంది. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మల్లగుల్లాలు పడుతోంది. అప్పుడా, ఇప్పుడా అంటూ.. నాన్చుతోంది. ఐతే గ్రామాల్లో మాత్రం ఈ ఎన్నికల అంశంపై సందడిగానే ఉంది. 

eeb33ebd-6a42-477d-a1eb-3ab8ac0b1683
జూలై లో ఎన్నికలు ఉండే అవకాశం

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ చివరి వారంలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

cf1faf7a-4e3d-418c-982e-50ba73d80373

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు..
ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే.. తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటుతుంది. అయితే ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది, తద్వారా న్యాయ సమీక్ష నుండి రక్షణ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే, తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. దీనికి ఆమోదం లభిస్తే...ఎన్నికల హడావిడి జోరు అందుకోనుంది.

Views: 354

About The Author

Latest News