ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తోరూర్ పరిధిలో ప్రారంభించిన ఎలిమినేటి నర్సింహా రెడ్డి

On
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూరు పరిధిలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎలిమినేటి నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. రైతులకు  జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అవకతవకలను పరిశీలించారు.
 కనీస వసతులు కూడా లేని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గమనించి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడడం జరిగింది.

IMG-20250520-WA0039

ధాన్యం కొనుగోలు కోసం రైస్ మిల్లర్లు ముందుకు రాకపోవడంతో రైతులు చాలా అవస్థలకు గురవుతున్నారు.
తాలు తేమ వంటి సాకులు చూపిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు సత్వరమే ధాన్యం కొనుగోలు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారూ, జిల్లా బిజెపి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ గారు, జిల్లా కార్యదర్శి పోరెడ్డి అర్జున్ గౌడ్ గారు, రాష్ట్ర బిజెపి క్రమశిక్షణా సంఘం సభ్యులు బోసు పల్లి ప్రతాప్ గారు,
మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ గారు,
రాష్ట్ర నాయకులు బచ్చి గళ్ళ రమేష్, కొండ్రు పురుషోత్తం, జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్జున్ గౌడ్ , తుర్కయంజాల్ మున్సిపాలిటీ సహకార బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ కొత్త రామ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు బల్దేవ్ రెడ్డి గారు  బాలకృష్ణ గౌడ్, కొంతం బల్ రెడ్డి మరియు స్థానిక రైతులు సీనియర్ నాయకులు నక్క రవీందర్ గౌడ్ జ్ఞానేశ్వర్ రవీందర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

IMG-20250520-WA0036

Views: 3

About The Author

Tags:

Related Posts

Latest News