హరీష్ రావును బుజ్జగించే పనిలో కెటిఆర్..!

On
హరీష్ రావును బుజ్జగించే పనిలో కెటిఆర్..!

హరీష్ రావుతో కెటిఆర్ ప్రత్యేకంగా భేటీ
కేటీఆర్ కు బిఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా? 
అందుకే హరీష్ రావును కేటీఆర్ కలిసారా?

బిఆర్ఎస్ లో అంతర్గత పోరు ఇప్పుడు బహిర్గతం అయ్యిందా? కెటిఆర్, హరీష్ రావు మధ్య పాటు.. మరింత ముదిరిందా? అందుకే కెటిఆర్ హరీష్ రావు భేటీకి కారణం ఏంటి.? హరీష్ రావు ను బుజ్జ కించడానికి ప్రయత్నిస్తున్నారా? 

బిఆర్ఎస్ పార్టీలో కొన్నిరోజులుగా నాయకత్వ మార్పు తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఎవరికి వారే.. పర్యటనలు చేయడం, మొన్నటి రజతోత్సవ సభలో హరీష్ రావు ఫోటో లేకపోవడం పార్టీలో చర్చకు దారి తీసింది.  

ఇక కొన్ని రోజులుగా హరీష్ రావు కు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని.. చర్చించుకొంటున్నారు. ఇక కవిత కూడా ఈ మధ్య తరచూ స్వతంత్రంగా పర్యటన, మొన్నీమధ్య సీఎం అవుతానని సోది కూడా చెప్పించి కున్నారు. ఇదిలా ఉంటే...హరీష్ రావు మొన్న పార్టీ పెడుతున్నారని పుకార్లు చేశాయి. ఈ పుకార్లను ఆయన కొట్టేశారు. ఇక కేసీఆర్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తే.. ఆయన నాయకత్వంలో పని చేస్తా అని.. అన్నారు. కేసీఆర్ చెప్పిన విధంగా పార్టీలో వ్యవహరిస్త అన్నారు. ఈ పరిణామాలు అన్నిటి మధ్య కేటీఆర్ హరీష్ రావు తో భేటీ అయ్యారు.. హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్రావు నివాసంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్, హరీశ్రావు భేటీ అయ్యారు. హరీశ్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. వీరు భేటీ పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. హరీష్ రావు ను బుజ్జగించడానికే కేటీఆర్ భేటీ అయ్యారని..అంటున్నారు.

Views: 35

About The Author

Tags:

Related Posts

Latest News