కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

విచారణకు కేసీఆర్ హాజరవుతారా?

On
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

కేసీఆర్ బాటలోనే హరీశ్ రావు, ఈటల రాజేందర్ నడుస్తారా? 
కాళేశ్వరం కమిషన్ విచారణలో ఏం తేలనుంది?  

సాయి సూర్య-తెలంగాణ:తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరంపై విచారణ కమిషన్ నోటీసులు జారీ. ఈ వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ను విచారిస్తుందా? కేసీఆర్ నోటీసులకు ఎలా స్పందించబోతున్నారు? విచారణకు హాజరవుతారా? కేసీఆర్ వ్యూహం ఏంటి అనే చర్చ మొదలైంది. కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు సైతం నోటీసులు ఇచ్చింది. 

కాళేశ్వరం ఫియర్స్ కుంగడంపై ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది. విచారణ పూర్తికాకపోవడంతో అనేక సందర్భాల్లో కమిషన్ కాల పరిమితి పొడిగిస్తూ  వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రోజులు కమిషన్ విచారణలో భాగంగా అనేక మంది అధికారులను ప్రశ్నించింది. ఇంజినీర్లు, కాంట్రాక్టర్, అధికారుల ఇలా కమిషన్ విచారణ మొత్తం వారి చుట్టే తిరిగింది. ఇక తుది విచారణ పూర్తి చేసుకొని త్వరలో నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అనూహ్యంగా  మళ్లీ గడువు పొడిగించింది. ఐతే ఇప్పుడు రాజకీయ నాయకులను విచారించాలని నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అందులో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపడం మరింత చర్చకు దారి తీసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పర్యవేక్షణలో నిర్మితమైంది. పదేళ్లు  అధికారంలో ఉండగా...సీఎంగా కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. వీరిది ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర. ఐతే కాళేశ్వరం పిల్లర్లు కుంగడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది. దీంతో కమిషన్ విచారణ కొనసాగిస్తూ వస్తోంది. తుది నివేదిక సిద్ధం అవగా...కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చింది. వీరిని విచారించకుండా నివేదిక ఇస్తే అసంపూర్తిగా ఉంటుందనే ఆలోచనలో కమిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. వీరు కమిషన్ విచారణకు హజరయ్యాక తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిచనున్నారు. 

ఇదిలా ఉంటే...ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రాజెక్టు నిర్మాణం అంశంలో కమిషన్ విచారణలో ప్రభుత్వానికి ఎదురదెబ్బ తగిలింది. కేసీఆర్ ను ఆ కమిషన్ కనీసం టచ్ కూడా చేయలేకపోయింది. దీంతో ఆచితూచి అడుగేస్తున్న ప్రభుత్వం...కమిషన్ గడువు పెంచడం,ఆ తర్వాత వెంటనే నోటీసులు ఇవ్వడం జరిగిపోయాయి. 

ఏకపక్ష రిపోర్టు కావొద్దని, అందరిని విచారించిన తర్వాతే తుది నివేదిక ఇస్తేనే బాగుంటుందని ఆలోచనతో ఆ ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. ఐతే కేసీఆర్ విచారణకు హాజరవుతారా? హరీశ్ రావు, ఈటల కేసీఆర్ బాటలో నడుస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Views: 33

About The Author

Latest News