కొహెడలో హైడ్రా రంగనాథ్ పర్యటన

On
కొహెడలో హైడ్రా రంగనాథ్ పర్యటన

ఆక్రమణలు పరిశీలించిన హైడ్రా కమిషనర్ 

తుర్కయంజల్-సాయిసూర్య:ఆక్రమణలపై హైడ్రా కోరాడ కొనసాగుతోంది. తాజాగా రంగా రెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో.. ఆక్రమణలను హైడ్రా కమీషనర్ రంగనాథ్ పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ సర్వే నెంబర్ 951,952లో లే అవుట్లను పరిశీలించారు. 

రాజాజీ నగర్‌ లే అవుట్‌ కు వచ్చి అక్రమాలను పరిశీలించారు. రోడ్లు, పార్కు స్థలంలో మళ్లీ నిర్మించిన కట్టడాలను తొలగించారు.
 సమ్మిరెడ్డి బాల్‌ రెడ్డి తమ ప్లాట్లను ఆక్రమించి, రహదారులపై అడ్డుగోడలు కట్టారని లే అవుట్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన హైడ్రా అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. బాల్‌ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ ప్రహరీ, ఫెన్సింగ్ గతంలోనే కూల్చివేశారు. అయితే బుధవారం రోజున హైడ్రా కమిషనర్‌ స్వయంగా  సమ్మిరెడ్డి బాల్‌ రెడ్డిపై హైడ్రా కమిషనర్‌ పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చెరువు ముంపు ప్రాంతాలను రంగనాథ్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్‌ కమిషనర్‌ అమరేందర్‌ రెడ్డి, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Latest News