పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేశాం: ప్రధాని మోదీ

ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది

On
పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేశాం: ప్రధాని మోదీ


22 నిమిషాల్లో ఉగ్రవాదుల 9 స్థావరాలను ధ్వంసం
ఆపరేషన్ సిందూర్ ఆక్రోశం కాదు సమర్ధ భారత రౌద్ర రూపం.
ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపం

సాయి సూర్య బ్యూరో:   జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం ఉగ్ర దాడి, పాకిస్తాన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. రాజస్తాన్ గడ్డ నుంచి మరోసారి ఉగ్రవాదులను, ఉగ్ర వాదాన్ని పోషించే పాకిస్తాన్ ను హెచ్చరించారు. మరోసారి ఉగ్రవాద చర్యలకు దిగితే.. పాతాళం లోకి తొక్కేస్తా అన్నారు. 

రాజస్తాన్ లోని బికనీర్ లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో భాగంగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభ నుంచి ఉగ్రవాదం, పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. 

ప్రజల ఆశీర్వాదం, దేశ సైన్యం సౌ ర్యంతో ఉగ్రవాదంపై విరుచుకుపడ్డామన్నారు ప్రధాని మోదీ. సోదరీమణుల సిందూర్ తుడిచేయాలని బయల్దేరిన వారిని హతం చేశామన్నారు. ఉగ్రవాదులు మతం అడిగి మన సోదరిమణుల సిందూరం తుడిచేశారని....పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడులతో యావత్ భారత ప్రజలు ఎంతో భాదపడ్డారన్నారు. దీని తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేయాలని సంకల్పం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని...త్రివిధ దళాలు చక్ర వ్యూహంతో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చేలా చేశాయని చెప్పారు.  ఏప్రిల్ 22 దాడికి జవాబుగా 22 నిమిషాల్లో ఉగ్రవాదుల 9 స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా తుదముట్టించామో ప్రపంచమంతా చూసిందన్నారు. 5ఏళ్ల క్రితం బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్ చేశాక...రాజస్థాన్‌లో మొదటి సభ నిర్వహించామన్నారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సిందూర్ తర్వాత మళ్లీ మొదటి సభ వీర భూమి రాజస్థాన్ లో ప్రసంగిస్తున్నామన్నారు. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశమంతా గర్వపడుతోందన్నారు.  ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపమని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆక్రోశం కాదు సమర్ధ భారత రౌద్ర రూపం. ప్రతి ఉగ్రవాద దాడిపై భారత సమాధానం ఆపరేషన్ సిందూర్ లానే ఉంటుందని స్ఫష్టం చేశారు.

ఇలా ప్రధాని ఉగ్రవాదం పై పోరు మరోసార్ స్పష్టం చేశారు. రాజస్తాన్ లోనే కాదు.. పెహల్గాం దాడి తర్వాత తొలిసారి బీహార్ లో నిర్వహించిన పంచాయతీ రాజ్ దినోత్సవ సభలోనూ టెర్రరిజం పై మండిపడ్డారు. తాజాగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News