కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

On
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం


సెమీ కండక్టర్ల రంగాన్ని ప్రొత్సాహించేలా నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్‌కు ఆమోదం

సాయిసూర్య-తెలంగాణ డెస్క్‌:సెమీ 573f71d1-6402-4acd-a3db-1276734cd6c4కండక్టర్ల రంగాన్ని ప్రొత్సాహించేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ కు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను మీడియాకు కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

సెమీ కండక్టర్ల రంగంలో  దేశం స్వావలంబన సాధించే దిశగా కేంద్రం మందడుగు వేసింది. మరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3700 కోట్ల పెట్టుబడితో కొత్త సెమీకండక్టర్ యూనిట్ ను  ఉత్తరప్రదేశ్ లోని జెవార్ లో ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. సెమీకండక్టర్ రంగంలో స్వావలంబన దిశగా దూసుకుపోతున్న భారత్.. ఇప్పటికే ఐదు సెమీకండక్టర్ యూనిట్లను నిర్మిస్తోంది. ఇవి దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. ఆరో యూనిట్ ను HCL, పాక్స్ కాన్ సంయుక్త వెంచర్ గా అభివ్రుద్ధి చేస్తారు. కేబినెట్ సమావేశం వివరాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. సెమీ కండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ సెమీకండక్టర్ యూనిట్‌ నిర్మాణంతో దాదాపు 2వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సెమీ కండక్టర్‌ యూనిట్లలో నెలకు 3.6 కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. కండక్టర్లకు వాడే పరికరాలు కూడా భారత్‌లో తయారు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సాంకేతికతపై దాదాపు 70 స్టార్టప్‌లు పని చేస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కొత్త విద్యా విధానం ద్వారా అకడమిక్‌ విద్య, పరిశ్రమల అనుసంధానానికి అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 270 విద్యా సంస్థల్లో విద్యార్థులకు సెమీ కండక్టర్ల సాంకేతికతపై శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు రూపొందించిన చిప్‌లను మొహాలీలో ఉత్పత్తి చేశారని..వాటి తయారీలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు.  టెలికాం విభాగం కోసం యూనివర్సిటీలో 5జీ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఇన్‌క్యుబేటర్ల ఏర్పాటు జరుగుతోందన్నారు.

Views: 16

About The Author

Latest News