వైన్ షాపుల్లో కొత్త ధరలో పాత మద్యం

పెంచిన ధరలతో పాత మందు విక్రయం

On
వైన్ షాపుల్లో కొత్త ధరలో పాత మద్యం

కొత్త వాటిని కొత్త ధరకు అమ్మాల్సిన షాపులు
ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్న వైన్స్ షాప్స్

సాయి సూర్య బ్యూరో:తెలంగాణలో మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ షాక్ ఇవ్వగా.. వైన్స్ షాప్స్ నిలువు దోపిడి చేస్తున్నాయి. కాయకష్టం చేసి.. కాస్త మందుతో రిలాక్స్ అవుదామంటే.. పాత మందుతో జేబులు గుల్లా చేస్తోంది. 

images (2)

తెలంగాణలో ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. క్వార్టర్‌ బాటిల్‌ మద్యానికి రూ.10.. హాఫ్, ఫుల్‌ బాటిళ్లపై రూ.20, రూ.40 చొప్పున పెంచుతూ తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు మే నెల19న అంటే సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు డిపోలతోపాటు మద్యం దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. బ్రూవరీల యాజమాన్యాల డిమాండ్ల మేరకు.. ప్రభుత్వం నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది. ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది.

పెరిగిన ధరలు కొత్తగా వచ్చే వాటిపై వర్తిస్తాయి. గతంలో తయారై..పాత రేటు ప్రింట్ తో ఉన్న మద్యం బాటిళ్లను ఆ రేటుతోనే విక్రయించాలి. కానీ పెరిగిన ధరలతో పాత లిక్కర్ అమ్మేస్తున్నారు. పాత లిక్కర్ స్టాక్ ఉంటే..కొత్త ధరలు అమలులోకి వచ్చినప్పటికీ..వాటికి పాత ధర వర్తిస్తుంది. పాత స్టాక్ అయిపోయే వరకు పాత ధరతోనే విక్రయించాలి. కానీ పాత లిక్కర్ కు కొత్త ధరతో విక్రయించి వైన్స్ షాపు యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం కొనుగోలుదారులు ఈ విషయం తెలిసి ప్రశ్నిస్తే...బెదిరింపులకు దిగుతున్నారు. తాగి గొడవ చేస్తున్నారంటూ...ప్రశ్నించిన వారిపైనే దాడులకు దిగుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.  

వ్యాపారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే...పర్యవేక్షణ చేయాల్సిన ఎక్సైజ్ శాఖ కిమ్మనకుండా ఉంది. ఎక్కడా ఎలాంటి తనికి లేదు. ఎలాంటి మద్యం విక్రయిస్తున్నారనే పర్యవేక్షణ లేదు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Views: 58

About The Author

Latest News