Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు

On
Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు

బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు కొన్ని రోడ్లు జలమయం అవ్వగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో బెంగళూరు వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. వర్షం తగ్గగానే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.ఈ క్రమంలో ప్రయాణికులు విమానాల పరిస్థితి గురించి తనిఖీ చేసుకోవాలని ఇండిగో సూచించింది. మీ ప్రయాణం రీషెడ్యూల్ చేయాలనుకుంటే, మీరు మా వెబ్‌సైట్ ద్వారా రీబుకింగ్ లేదా వాపసు ఎంపికలను పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఇతర విమాన సంస్థలు తమ ప్రయాణికులకు రీషెడ్యూలింగ్, రీ బుకింగ్ లేదా టికెట్ వాపసు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమానాల కార్యకలాపాలు సజావుగా కొనసాగిస్తామని ఆయా సంస్థలు తెలిపాయి.

Views: 44

Latest News

SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్  కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్