Pawan Kalyan :హరిహరవీరమల్లు మే 9న విడుదల

ర్యూమర్స్‌కు చెక్‌ పెట్టిన మూవీ మేకర్స్‌ 

On

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న సినిమా ’హరిహర వీరమల్లు’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. తొలిభాగం ’హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రిలీజ్‌ కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల అవుతున్నట్లు- ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు విడుదల ఆలస్యం కానున్నట్లు- కొన్ని రోజులుగా సోషల్‌ విూడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌పై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. మే 9న హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయనున్నట్లు- మేకర్స్‌ సోషల్‌ విూడియాలో తెలిపారు. ’రీ రికార్డింగ్‌, డబ్బింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెరుపు వేగంతో పనులు దూసుకుపోతున్నాయి. ఈ వేసవికి అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందిస్తాము. మే 9న హరిహర వీరమల్లు బిగ్‌ స్క్రీన్‌లలో విడుదల అవుతుంది. మునుపెన్నడూ చూడని సినిమాటిక్‌ అనుభూతికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి’ అని మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. పవన్‌కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఈ పోస్టుతో నెట్టింట రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

HARIHARA
హరిహర వీరమల్లు' చిత్రం మే 9న విడుదల


హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలిభాగం ’హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ సరసన #Nidhi Agarwalనటించారు. అనుపమ్‌ ఖేర్‌, బాబీ దేవోల్‌, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్‌ లేట్‌ అయింది. ముందుగా మార్చి 28న విడుదల చేయాలని భావించినా.. మే 9కు వాయిదా వేశారు.

Views: 31

Related Posts

Latest News

SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్) SSC result:పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ (తుర్కయంజాల్ బ్రాంచ్)
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్  కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...
దేశంలో జనాభా లెక్కలకు మోక్షం
పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి
మంత్రి పదవి ఆశవహులకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ పార్టీకి హరీశ్ రావు దూరం అవుతున్నారా? 
రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్: కేసీఆర్