కవిత లేఖ రిలీజ్ చేసింది వారేనా...?
కవితను బయటికి పంపేసే కుట్ర జరిగిందా?

కవిత పార్టీ మారుతున్నారని తెలిసి...లేఖ లీక్ చేశారా?
విదేశాల్లో ఉండగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి?
కేటీఆర్ తో విభేదాలు ఉన్నాయా
సాయిసూర్య- తెలంగాణ డెస్క్:బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కవిత లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. తన తండ్రికే కవిత లేఖ ద్వారా పలు అంశాలను చెప్పడం చర్చనీయం. లేఖ పై కవిత క్లారిటీ ఇవ్వడం మరో సంచలనం. ఇక ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ సహా పార్టీలన్నీ స్పందించడం సర్వసాధారణమే. కానీ ఇన్నాళ్లు బయట వినిపించిన టాక్ నిజమే అని తెలిసేలా చేసింది.
ఎమ్మెల్సీ కవితగా కాదు..ఆమె కేసీఆర్ తనయాగా, కేటీఆర్ సహోదరిగా గుర్తింపు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో.. ప్రముఖురాలుగా పరిచయం. కానీ అంతకు మించి... ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొని.. జైలు పాలు అయిన మహిళగా దేశ వ్యాప్త సంచలనం.
జైలు నుంచి వచ్చాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న కవిత.. మెల్లి మెల్లిగా యాక్టివ్ అయ్యారు. స్వతంత్రంగా జిల్లా పర్యటనలు చేశారు. కెటిఆర్, హరీష్ రావు ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు సాగిస్తుంటే.. ఇంకో పక్క కవిత తనదైన వ్యూహం తో ముందుకు సాగుతున్నారు. దీంతో ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా పార్టీలో నడుస్తోందని చర్చ జరుగుతోంది.
కవిత జైలు నుంచి వచ్చాక ఫ్యామిలీతో కొంత గ్యాప్ వచ్చింది. కెటిఆర్ తో కాస్త దూరం పెరిగిందని చెప్పాలి. ఐతే.. ఆమె జైలు నుంచి బయటికి రావడానికి కేటీఆర్ చేసిన విశ్వ ప్రయత్నాల వల్లే జరిగిందంటారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు దూరం పెంచినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే...ఇటీవల జిల్లాల పర్యటనలు కవిత చేపట్టడం, కేటీఆర్ కు సమాచారం ఇవ్వకపోవడం, ఆయా నేతలను తన వైపు తిప్పుకుంటున్నారు అనే భావనలో...కొంత దూరం ఏర్పడిందట. ఇదిలా ఉంటే ఈ మధ్య కవిత సీఎం అవుతానంటూ సోది చెప్పించుకోవడం కేటీఆర్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇవన్నీ కవిత లెటర్ లీక్ కు కారణంగా చెప్తున్నారు
ఇదిలా ఉంటే.. కవిత కేసీఆర్ కి లేఖ రాయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కేసీఆర్ తో నేరుగా యాక్సెస్ ఉన్న అతి కొద్ది మందిలో ఆమె ఒకరు. ఆమె నేరుగా వెళ్ళి కలిసి.. తాను చెప్పాలనుకున్న విషయం చెప్పేయవచ్చు. అలా కాకుండా లేఖ ద్వారా తెలియజేయడం వెనుక అంతర్యం ఏమిటి..? మిగతా నేతల లానే..కవిత కేసీఆర్ ను కలవలేకపోతున్నారా? అనే సందేహం కలుగుతుంది. ఇక మరో అంశం ఆ లేఖ...ఎవరు బయటికి విడుదల చేశారు అని. అది ఆమె విదేశీ పర్యటన లో ఉండగా రిలీజ్ కావడం. గతంలో చూస్తే ఏ సంఘటనలు అయినా.. సంబంధిత వ్యక్తి.. విదేశాల్లో ఉన్నప్పుడు..సంచలన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది.
మొత్తంగా బిఆర్ఎస్ లో కవిత లేఖ..పై ప్రస్తుత చర్చ.. ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
About The Author
