America:అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Telugu student dies in America

On
America:అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ (27)  అమెరికాలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మిల్వాంకివి స్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటూ ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్నాడు. ఇంటికి దగ్గర్లోని బీచ్‌ వద్ద దుండగుడు గన్‌తో కాల్పులు జరపడంతో.. ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు

Views: 249

About The Author

Latest News