విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణం

గురునానక్ యూనివర్సిటీ హాస్టల్ లో విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణం

On
విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణం

ఇబ్రహీంపట్నం, సాయి సూర్య:ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజీకి చెందిన హాస్టల్లో  ఓవిద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురనవెళ్లి గ్రామానికి చెందిన అల్లూరి శశిరెడ్డి, ఆయన భార్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరిలో భావన (22) రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మరో అమ్మాయి జూబ్లీహిల్స్ లో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. అయితే శనివారం ఉదయం 10 గంటలకు భావన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె మృతిపై ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు తెలియరాలేదు. భావన మృతిపై హాస్టల్ వార్డన్ పోలీసులకు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Views: 122

About The Author

Latest News